పెద్దాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 18 కేసులు నమోదు చేసినట్లు పెద్దాపురం ఎక్సైజ్ సీఐ కేవీవీడీ అర్జునరావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మొత్తం 18 కేసులు నమోదు చేసి, 9 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. 4. 68 లీటర్ల డీపీఎల్, 39. 5 లీటర్ల సారాయి సీజ్ చేసి, 8, 400 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశామని, 7 మంది సారాయి నిందితులను బైండోవర్ చేసినట్లు తెలిపారు.