నిడదవోలు: మంత్రి దుర్గేశ్ వల్లే మా అమ్మాయి బతికింది
రాష్ట్ర పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ చొరవతో చావు బతుకుల మధ్య ఉన్న తన కుమార్తె మృత్యువును జయించిందంటూ ఒక మహిళ నిడదవోలులోని వససమారాధనలో చేసిన వ్యాఖ్యలు శుక్రవారం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చావు బతుకుల్లో ఉన్న మా అమ్మాయికి గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మంత్రి రూ. 10 లక్షలు విలువైన ట్రీట్మెంట్ ఉచితంగా ఇప్పించారని, 'మీకు ధన్యవాదాలు సార్' అంటూ ఆమె పాదాభివందనం చేశారు.