ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఈ నెల 14 వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా పోరు కార్యక్రమం విజయవంతం చేయాలని మంగళవారం చాగల్లు బస్టాండ్ సెంటర్ వద్ద పోస్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో నూతన ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు తెలియజేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.