గోపాలపురం మండలం ఉప్పరగూడెం గ్రామంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. దీంతో దాదాపు గంటన్నర వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు నిలిచింది. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరినట్లు స్థానికులు తెలిపారు.