అనంత: బీఎల్ ఓ ల పెండింగ్ రెమ్యూనరేషన్ మంజూరు చేయాలి
ఎన్నికల బడ్జెట్లో బీఎల్ వో ల కు పెండింగ్ లో ఉన్న రెమ్యునరేషన్ ను త్వరగా మంజూరు చేయాలని సచివాలయం ఉద్యోగులు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆర్డీవో వసంత బాబు, తాసిల్దార్ హరికుమార్ కు వేర్వేరుగా వినతి పత్రాన్ని అందజేశారు. బీఎల్డీ లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ నాలుగేళ్లుగా బీఎల్ఎలు భాద్యతలు నిర్వహిస్తున్నా ఇబ్బందులకు గురిచేయడం హేయమైన చర్య అని అన్నారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ పాల్గొన్నారు.