ఎవరైనా మహిళలు, విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా ర్యాగింగ్ చేసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని అమలాపురం ఎస్ఐ శేఖర్ బాబు అన్నారు. జనుపల్లి మన్నా కాలనీలో సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో శుక్రవారం మహిళా సంరక్షణపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై వారికి పలు సూచనలు చేశారు.