అమలాపురం మండలంలోని సమనసలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ను విదేశీ విద్యావేత్తలు శుక్రవారం సందర్శించారు. పాఠశాలలో జరుగుతున్న అనేక విద్యాపరమైన అంశాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాలను గురించి ఎంతో ఆసక్తితో తెలుసుకున్నారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో మమేకమై అనేక విషయాలను తెలుసుకున్నారు. పాఠశాల నిర్వహిస్తున్న విద్యా విధానంపై ఎంతో సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.