కోనసీమలో వివిధ విభాగాల రెవెన్యూ ఉద్యోగులు పనితీరును మెరుగుపరచుకోవాలని జేసీ నిషాంతి హెచ్చరించారు. అమలాపురం మండలం అమలాపురంలోని కలెక్టరేట్లో రెవెన్యూ ఉద్యోగులతో జిల్లా జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం సెక్షన్ల పని తీరుపై సమీక్షించారు. సెక్షన్ అధికారులు ప్రతి ఒక్కరికి రోజు వారీగా విధులు కేటాయిస్తూ సాయంత్రానికి నివేదిక సమర్పించాలని కోరారు.