తుని మండలం మరువాడ సమీపంలో 10 లీటర్ల నాటుసారాను తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ ఎస్సై కృష్ణామాచారి తెలిపారు. సోమవారం సాయంత్రం మరువాడ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా రౌతులపూడి మండలం లచ్చిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన కొంకిపూడి వీరబాబు ద్విచక్రవాహనంపై నాటు సారాను తరలిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశామన్నారు.