దేశ అభివృద్ధిలో స్త్రీలు, పిల్లలు కీలక పాత్ర పోషిస్తున్నారు
దేశ జనాభాలో స్త్రీలు, పిల్లలు మూడింట రెండు వంతులు ఉన్నారని, వీరు దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఐసిడిఎస్ చిట్వేలి సిడిపిఓ రాజేశ్వరి అన్నారు. సోమవారం మండలం వ్యాప్తంగా సక్ష్యం అంగన్వాడి 2. o కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరు సంవత్సరాల లోపు పిల్లలు, కౌమార దశ బాలికలు, గర్భవతులు, బాలింతలు పోషకాహార లోపాన్ని అధిగమించి ఆరోగ్యమైన సమాజం వైపు అడుగులు వేయాలని అన్నారు.