అన్నమయ్య జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును శనివారం కలిశారు. రాయచోటి నియోజకవర్గంలో రిజర్వాయర్ల అభివృద్ధి పనులకు రూ. 156. 60 కోట్లు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలో చెరువుల మరమ్మతులు, తాగునీటి అవసరాలు తీర్చాలని విన్నవించారు. ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు.