కిశోర బాలికల్లో చైతన్యంతోనే నైపుణ్య ఆంధ్రప్రదేశ్ కు అంకురార్పణ అని చిట్వేలు సిడిపిఓ రాజేశ్వరి అన్నారు. మంగళవారం కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలందరికీ అర్థమయ్యేలా వారితోనే చేసి చూపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శరీర భాగాలు అనేవి ఎవరికి వాళ్ళ సొంతమని, వారి శరీర భాగాలను వ్యక్తులు తాకిన అభ్యంతరం వ్యక్తం చేయాలన్నారు.