చిట్వేలి మండలంలో సాగుకు అనుకూలమైన అటవీ శాఖ బీడు భూములను గిరిజనులకు పంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండుగోల మణి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం తిప్పన ప్రసాద్ అధ్యక్షతన జరిగిన చిట్వేలి మండల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గిరిజనులు సాగు భూములు లేక భూ యజమానుల వద్ద కూలీలుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన కుటుంబానికి ఒక్కొక్కరికి 3 ఎకరాల భూమి పంచాలని కోరారు.