రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ లో గాలేరు-నగరి సుజల స్రవంతికి రూ. 2438. 94 కోట్లు కేటాయించడం సంతోషకరమని రాష్ట్ర రైతు సంఘం నాయకులు మలిశెట్టి రాహుల్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం చిట్వేలులో రాహుల్ మాట్లాడుతూ గాలేరు-నగరి నీటి ద్వారా కోడూరు, రాజంపేట చెరువులను నింపే అవకాశం ఉందన్నారు. కాలువను త్వరితగతిన పూర్తి చేస్తే ఈ ప్రాంతం త్రాగు, సాగు నీటితో సస్యశ్యామలం అవుతుందన్నారు.