పులివెందుల: 'గడ్డి మందులను విక్రయిస్తే కఠిన చర్యలు
ఎరువుల దుకాణాలలో గడ్డి మందులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని భూ సంరక్షణ ఇన్ఛార్జ్, డీడీఏ అనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం పులివెందుల పట్టణంలోని ఎరువుల దుకాణాలను ఆమె తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీడీఏ అనిత మాట్లాడుతూ. ఎరువుల దుకాణాలలో గ్లైసిల్ గడ్డి మందును ఎవరూ విక్రయించరాదని, ఎవరైనా విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు కేసులు కూడా నమోదు చేస్తామన్నారు.