ఇటీవల సింహాద్రిపురం మండలం బలపనూరు గ్రామంలో దళితుడిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ నాయకులు కోళ్ల భాస్కర్, రమణ, గంగరాజులు పేర్కొన్నారు. శుక్రవారం బాధితుడు భార్గవ్ కుటుంబ సభ్యులను వారు పరామర్శించారు. అనంతరం పులివెందుల పట్టణంలో అంబేడ్కర్ విగ్రహానికి వారు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. దళితుడిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి శిక్షించాలన్నారు.