సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం అడిగిన దరఖాస్తుదారుకు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి రమేష్ సిబ్బందికి సూచించారు. గురువారం లింగాల రైతు సేవా కేంద్రంలో సమాచార హక్కు చట్టం 2005 పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సెక్షన్ 6, 7 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులకు 30 రోజుల్లో సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. సమాచారం ఇవ్వని అధికారిపై జరిమానా చర్యలు తీసుకుంటామన్నారు.