ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డులోని అంగన్వాడీ కేంద్రాన్ని బుధవారం ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సీమంతం, అన్నప్రాసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారాన్ని అందించాలని ఆయన అంగన్వాడీ వర్కర్లకు సూచించారు. ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, సీడీపీఓ అరుణ కుమారి, సూపర్వైజర్ కళావతి పాల్గొన్నారు.