సోషల్ మీడియాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిల్లలపై అసభ్యకర పోస్టులు పెట్టిన వారిని అరెస్టు చేయాలని జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం కోరారు. శనివారం మదనపల్లి రెండవ పట్టణం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ట్విట్టర్, ఫేస్బుక్ లలో రెడ్డి అమ్మాయి పేరుతో అసభ్య పదాలతో పోస్టులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.