చెన్నూరు: రైతులకు మినుము విత్తనాలు పంపిణీ
జాతీయ ఆహార భద్రత పథకం ద్వారా 2024 రబీకి గాను 100 శాతం సబ్సిడీపై రైతులకు విత్తనాలు పంపిణీ చేసినట్లు చెన్నూరు మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు. సోమవారం మండలంలోని శివాలపల్లె, ఉప్పరపల్లె గ్రామ రైతులకు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, టీడీపి మండల అధ్యక్షుడు కల్లూరు విజయభాస్కర్ రెడ్డి చేతుల మీదుగా విత్తనాలను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇందిరెడ్డి శివారెడ్డి పాల్గొన్నారు.