కడప జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 9, 10, 23, 24 తేదీల్లో ఆయా పోలింగ్ కేంద్రాల్లో బీఎల్వోలు అందుబాటులో ఉంటారు. ఇక్కడ కొత్తగా ఓటరు నమోదు, అభ్యంతరాలు, చిరునామా మార్పులు, చేర్పులు, ఇతర అంశాలకు సంబంధించి ప్రత్యేక పత్రాలను స్వీకరిస్తారు. ప్రత్యేక శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కడప ఎన్నికల అధికారి జాన్ ఇర్విన్ సూచించారు.