కడప రైల్వేస్టేషన్ పరిధిలో రైలు కిందపడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీకేదిన్నె మండలం సీఎంఆర్ పల్లెకు చెందిన మేకల రాజన్న (35)కు భార్యా పిల్లలున్నారు. ఇటీవల రాజన్న భార్య అనారోగ్యానికి గురవడంతో ఆమెకు వైద్యం చేయించారు. వైద్యం కోసం రూ. లక్షలు వెచ్చించారు. అయినప్పటికీ నయం కాలేదు. దీంతో మనస్తాపానికి గురైన రాజన్న శనివారం రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.