తాడికొండ అడ్డరోడ్డు కామాక్షి గ్యాస్ ఏజెన్సీ వద్ద ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన ఏడాదికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ శుక్రవారం ప్రారంభించి, లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వంటగదిలో ఇక పొగ కష్టం, ఆర్థిక భారం ఉండకూడదని కూటమి ప్రభుత్వం ఈ పథకం ప్రవేశపెట్టిందన్నారు.