వేటపాలెం మండలం చేనేతపూరి కాలనీ నందు పేకాట ఆడుతున్నారని సమాచారంతో ఎస్సై వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి మంగళవారం దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 700 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు చెప్పారు. మండలంలో పేకాట, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు.