విజయవాడ: రాజధాని అమరావతి అభివృద్ధి కోసం విరాళం
అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా రాజధాని అమరావతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రికి రూ.13.5లక్షల నగదు చెక్కును గురువారం అందించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి కి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ డాక్టర్ మనోజ్, ఆయన కుమార్తె అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ముఖ్యమంత్రికి స్వయంగా అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారిని అభినందించారు.