అమావాస్య చీకటిని పారద్రోలుతూ తమ జీవితాల్లోకి వెలుగులు తీసుకురావాలని దీపావళి పండుగ రోజు ఇంట్లో దీపాలు వెలిగిస్తారు. దీపం.. ఇంట్లోని ప్రతికూలతలను తరిమికొడుతుంది. దీపావళి రోజు కేవలం గుమ్మం దగ్గర, పూజ గదిలో కాకుండా ఇతర ప్రదేశాల్లోనూ దీపాలు పెట్టడం వల్ల ఇంటికి శ్రేయస్సు, సంపద కలుగుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఉత్తరం/ఈశాన్య దిశలో దీపం వెలిగిస్తే ఇంటికి సంపద చేకూరుతుంది. అలాగే మెరుగైన ఆరోగ్యం కోసం తూర్పు దిశలో దీపం వెలిగించాలి.