జీలుగుమిల్లిలో దీపం 2.0 పథకం ప్రారంభం
జీలుగుమిల్లి మండల కేంద్రంలో దీపం 2. 0 పథకంలో భాగంగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన పేద మహిళలకు ఆయన ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహిళలు అన్ని రంగాల్లో ఆర్థికంగా బలోపేతం కావడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం అని అన్నారు