ఏలూరు జిల్లాలో జనవరి 2025 నాటికి 18 ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో ఎస్ఎస్ఆర్ -2025 డ్రాఫ్ట్ పబ్లికేషన్ ను కలెక్టర్ విడుదల చేశారు. పోలవరం(ఎస్టీ) నియోజకవర్గంలో 1, 22, 959 మంది పురుష ఓటర్లు, 1, 31, 372 మంది మహిళా ఓటర్లు, 09 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కలిపి మొత్తం 2, 54, 340 మంది ఓటర్లు ఉన్నారన్నారు.