కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో మంగళవారం పేకాట శిబిరంపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారి వద్ద నుండి నుండి ₹. 61,500 నగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైనా పేకాట, కోడిపందాలు నిర్వహించిన లేదా కోడి కత్తులను కలిగి ఉన్న తయారుచేసి సరఫరా చేసిన చర్యలు తప్పవన్నారు.