జీలుగుమిల్లి: వ్యవసాయ పంపుసెట్లుకు మీటర్లు రైతుల మెడలకు ఉరితాళ్లు

72பார்த்தது
వ్యవసాయ పంపుసెట్లుకు మీటర్లు రైతుల మెడలకు ఉరితాళ్లు అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ విమర్శించారు. ఆదివారం జీలుగుమిల్లి లోని ప్రజాసంఘాల కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ప్రైవేటీకరణ కోసం విద్యుత్ సవరణ బిల్లు తీసుకువచ్చిందన్నారు. ఈ బిల్లులో ఉచిత విద్యుత్ అమలు చేయడానికి వీలు లేదని పేర్కొన్నారని వివరించారు.

தொடர்புடைய செய்தி