ఆగిరిపల్లి మండలం అడవి నెక్కలంలో స్థానిక కార్యకర్తలు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. నూజివీడు రూరల్ మండలం బురువంచకు చెందిన ఐ టీడీపీ అధికార ప్రతినిధి మణిరత్నం, వైయస్సార్ ఫ్లెక్సీని చూసి తట్టుకోలేక ఫ్లెక్సీని ధ్వంసం చేశాడు. అక్కడే ఉన్న కొంతమంది వైసీపీ కార్యకర్తలు అడ్డుకోపోతుండగా వారిపై కరత్రో దాడి చేసి పారిపోతుండగా కార్యకర్తలు పట్టుకొని పోలీసులకు సోమవారం అప్పగించారు.