పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలంలో శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నామని ఆ శాఖ ఈఈ కె. మధుకుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ పట్టణంలోని వైఎన్ కళాశాల, పుష్కరఘాట్, పంటురేవు, రైతుబజారు, లూథరన్ చర్చిరోడ్డు, కొండాలమ్మ ఆలయం, పంజా సెంటరు, స్టీమర్రోడ్డు, సబ్ జైలు, గంటలమ్మ ఆలయ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందన్నారు.