హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోరుతూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5న విజయవాడలో చేపట్టిన ‘హైందవ శంఖారావం’ భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని హైందవ శంఖారావం విభాగ్ నాయకులు కే. దుర్గాప్రసాద్ అన్నారు. గురువారం లోకుముడి దత్తాశ్రమంలో హైందవ శంఖారావం కైకలూరు ఖండ సన్నాహక సమావేశం నిర్వహించారు. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాల పూర్తయిన హిందువులు తమ దేవాలయాలు తాము నిర్వహించుకునే స్వేచ్చ నేటికీ రాలేదన్నారు.