గోపాలపురం: ఆర్ధిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఆత్మహత్య చేసుకుని ఒక వ్యక్తి మరణించిన ఘటన గోపాలపురంలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం బీసీ కాలనీకి చెందిన షేక్ షకీర్ 2నెలల క్రితం ఫైనాన్స్ ద్వారా లారీని కొన్నాడు. దీంతో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువై తన ఇంట్లో చీరతో ఉరేసుకొని మరణించాడన్నారు. ఈ ఘటనపై భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని శుక్రవారం సతీష్ తెలిపారు.