పెదపాడు: అభివృద్ది పనులకు ఎమ్మెల్యే చింతమనేని శంకుస్థాపన
పెదపాడు మండలం పెదపాడు గ్రామంలో బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ.. పల్లె పండగ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధికి పల్లె పండగ ద్వారా 4500 కోట్ల రూపాయలు కేటాయించి, రాష్ట్ర ప్రభుత్వం అసలైన గ్రామ స్వరాజ్యానికి నాంది పలికింది అన్నారు.