పెదవేగి: పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

59பார்த்தது
పెదవేగి మండలం జగన్నాధపురం వైపు చిరుత పులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో జగన్నాథపురంతో పాటు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెదవేగి సీఐ కె. వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం రాత్రి ఫారెస్ట్ అధికారులతో పాటు పెదవేగి పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని పులి పాద ముద్రలను గుర్తించడం జరిగిందని, పొలాలకు వెళ్లేవారు ఒంటరిగా వెళ్లకూడదని, వెళ్లినా కర్ర పట్టుకుని వెళ్లాలన్నారు.

தொடர்புடைய செய்தி