ఆలమూరు: ప్రజా సమస్యల పరిష్కారమే అజెండా కావాలి
ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా ఉండాలని అధికారులను ఉద్దేశించి కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానంద రావు అన్నారు. ఆలమూరు మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజా దర్బార్ ను నిర్వహించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రాలను సత్యానందరావు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.