శాంతి భద్రతల పరిరక్షణలోనిబద్ధతతో పనిచేసే పోలీసులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచించారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదానశిబిరాన్ని ఎమ్మెల్యే సత్యానంద రావు సోమవారం ప్రారంభించారు. రక్తదానంచేసిన వారికి సర్టిఫికెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలోడిఎస్పి గోవిందరావు, సీఐ సిహెచ్ విద్యాసాగర్ పాల్గొన్నారు.