కొత్తపేట: ఉత్తమ ఉద్యోగులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది
విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించే ఉద్యోగులకు ఎప్పుడు గుర్తింపు లభిస్తుందని గంటి సర్పంచ్ సాగి బంగారు రాజు అన్నారు. కొత్తపేట మండలం గంటి గ్రామ సచివాలయంలో బదిలీపై వెళ్తున్న పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, విఆర్ఓ రాంబాబును శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి విషయంలో పాలకవర్గానికి కార్యదర్శి వరలక్ష్మి, వీఆర్వో రాంబాబు అందించిన సహకారం అభినంద నీయమన్నారు.