కాకినాడ జిజిహెచ్ లో సినిమా చూపిస్తూ ఆపరేషన్
జిజిహెచ్ కాకినాడ న్యూరో సర్జరీ టీం 55 ఏళ్ల మహిళా రోగి కి 15 రోజుల నుండి కుడి చెయ్యి, కుడికాలు బలహీనతతో కాకినాడలోని జిజిహెచ్ లో అత్యవసర విభాగానికి వచ్చింది. ఆమెను పరీక్ష చేసిన వైద్యులు జాయిన్ చేసి, ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఆమెకి ఎడమవైపు మెదడులో ఒక కణితి ఉందని న్యూరోసర్జెన్ల బృందం గుర్తించారు. దానిని క్యాన్సర్ గా గుర్తించారు. ఆమెకు జిజిహెచ్ మంగళవారం సాయంత్రం సినిమా చూపిస్తూ ఆ రోగికి ఆపరేషన్ చేశారు.