కాకినాడ: శివనామ స్మరణతో మారుమోగిన శివాలయాలు
కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా కాకినాడ లోని శైవ క్షేత్రాలన్నీ కళకళలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. సోమవారం తెల్లవారుజాము నుంచే మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శివాలయాలలో ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. స్వామివారికి ప్రత్యేక పూజలను భక్తులు నిర్వహించారు.