పెద్దాపురం శతాబ్ది పార్కులో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి ఫుడ్ కోర్టు హోటల్ ను పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆదివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్ లోని ఆహార సరఫరా విభాగాన్ని జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజా సూరిబాబు రాజు, కమిషనర్ పద్మావతి, తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.