నిడదవోలు పట్టణ మైనార్టీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి వైసీపీకి సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ పంపించినట్లు మస్తాన్ వలి తెలిపారు. ఈ మేరకు వైసీపీలో నాయకులు, కార్యకర్తలకు గుర్తింపు లేదని, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ నాయుడు వ్యవహార శైలి నచ్చక రాజీనామా చేశానన్నారు.