నిడదవోలు మండలం సింగవరం ఎంపీపీ స్కూల్ లో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలకు అందుతున్న సదుపాయాల గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు వ్యాధుల బారిన పడకుండా మెడిసిన్ అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. అలాగే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులకు ఇబ్బందు లేకుండా చూస్తామన్నారు.