డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో ట్రాఫిక్ కు అడ్డంకిగా వున్న ఆక్రమణల తొలగింపు కార్యక్రమాన్ని శనివారం మునిసిపల్ అధికారులు చేపట్టారు. తొలగించిన చోట తిరిగి ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మండపేట పురపాలక సంఘ పరిధిలోని మెయిన్ రోడ్డు కె. పి రోడ్డులో ఉన్న ఆక్రమణలను తొలగించారు. టౌన్ ప్లానింగ్ అధికారి పర్యవేక్షణలో సంబంధిత వార్డు ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.