తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని కొత్తపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. పి. రాజు సూచించారు. కొత్తపేట వికెవి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సర విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళాశాలలో రెగ్యులర్ క్లాసులతో పాటు కెరీర్ ఓరియంటెడ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.