కొత్తపేట మండల పరిధిలోని పలివెల గంటి రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఆయా గ్రామ ప్రజలు ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోడ్డు దుస్థితిని ఒకసారి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించాలని కోరుతున్నారు. మూడు నుంచి నాలుగు అడుగుల లోతుతో పెద్దపెద్ద గోతులు పడి అత్యంత ప్రమాదకర స్థితిలో ఈ రోడ్డు ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది ఈ గోతులలో పడి గాయాల పాలయ్యారో అని వాపోతున్నారు.