ద్వారకాతిరుమలలో రెండు పొడపాములు సయ్యాటలాడాయి. శివాలయానికి సమీపంలోనే శేషాచల కొండ దిగువ భాగాన పాములు సయ్యాటలాడటం చూసిన స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే శుక్రవారం కార్తీక పౌర్ణమి కావడంతో పాముల సయ్యాటను దేవుని మహత్యంగా స్థానికులు భావిస్తున్నారు. సుమారు గంట సేపు పైగా రెండు పొడపాములు ఒకదానితో ఒకటి బుసలు కొట్టుకుంటూ సయ్యాటలాడాయి.