నల్లజర్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థానంలో పెద్ద ఆసుపత్రి నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజు తెలిపారు. ఈ సందర్భంగా పీహెచ్సీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. అవసరమైన స్థల సేకరణకు సహకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పలువురు నాయకులు ఆయన వెంట ఉన్నారు.