పెదపూడి: పశు గణన గోడ పత్రికలు ఆవిష్కరించిన ఎమ్మెల్యే
పెదపూడి ఎంపీడీవో కార్యాలయంలో 21వ అఖిల భారత పశు గణన గోడ పత్రికలను, స్టాంపులను ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మంగళ వారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. గోదావరి జిల్లా రైతాంగానికి, పశుపోషణకు సంబంధం ఉందని, పాడి పరిశ్రమ ద్వారా రైతాంగానికి మరింత ఆదాయం సమకూర్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.